దేశంలో గత 24 గంటల్లో 4987 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2872 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్19 కేసుల్లో గత 24 గంటల్లో 120 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 34వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 37.51గా ఉన్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.
