జిహెచ్ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ భవనంలో 8 కరోనా పాజిటివ్ కేసులు న మోదు కాగా, ధూల్‌పేట్‌లోని శివలాల్‌నగర్‌లో ఓ కరోనా పాజిటివ్ వచ్చింది. అదే ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్ కార్మికురాలికి (60) కరోనా నిర్థ్దారణ కా వడంతో చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటు వారి ఇంట్లో ఉండే 21 మందిని ఎస్ఆర్నగర్లోని ఆసుపత్రికి క్వారంటైన్ఃకు తరలించారు.
కామన్ బాత్రూమ్ కొంప ముంచిందా ?
గోషామహల్ పరిధిలోని ఓ భవనంలో నివసించే వారంతా కామన్ బాత్రూమ్ను వినియోగించడం వారి కొంపముంచింది. ఆ భవనంలో అద్దెకు ఉండే ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం కరోనా పాటిజివ్ రాగా ఆ భవనంలో అద్దెకు ఉంటున్న 62 మందిని పోలీసులు, ఇతర అధికారులు ఆసుపత్రికి తరలించి, చికిత్సలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ నిర్థ్దారణ అయ్యింది. తాజాగా శనివారం అదే భవనంలో నివసించే 8 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అయితే భవనంలో అద్దెకు ఉంటున్న వారంతా కామన్ బాత్రూమ్ వినియోగించడం వల్లే కరోనా సోకినట్లు సమాచారం.