కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ట్రైమెక్స్ గ్రూప్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించింది. ప్రకటించిన విరాళాన్ని ఆర్టీజీఎస్ ద్వారా జమ చేసింది. సోమవారం విరాళానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ కు ట్రైమెక్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు అందజేశారు