ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజకు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,339కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 691 యాక్టివ్ కేసులు ఉండగా, ఈ వైరస్ బారిన పడిన 1596 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 52 మంది మరణించారు.  
గడిచిన 24 గంటల్లో చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించగా, 69 మంది కోలుకున్నారు.