టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేధిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటికే కేసులు పెరిగితే తదుపరి నిర్ణయం తీసుకుంటామని టిఎస్ హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది. దీంతో పదోతరగతి‌ పరీక్షలను వాయిదా పడ్డాయి.

ఈ పరీక్షలను జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్-19 నివారణ జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉండేలా చూడాలని చెప్పింది. లాక్‌డౌన్‌ ముందు 10వ తరగతికి సంబంధించి మూడు పరీక్షలు జరగాయి. మరో ఎనిమిది పరీక్షలు మిగిలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచే అవకాశం ఉంది.