ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎం.ప్రతాప్ తెలిపారు. నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని బస్సులను మాత్రమే నడుపుతున్నట్లు చెప్పారు. విడుతల వారీగా బస్సు సర్వీసులను పెంచనున్నట్లు వెల్లడించారు. తొలిరోజు 1683 బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాల ఆదేశాల మేరకు నియమాలను పాటిస్తూ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.