కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్ అయి వెళ్లారు. కాగా కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల 719 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్-19 వల్ల అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 1,561 మంది చనిపోయారు. వ్యాధి కారణంగా యూఎస్ఏలో ఇప్పటివరకు 94,994 మంది మరణించారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటివరకు అత్యధికంగా మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూకే-35,704, ఇటలీ-32,330, ఫ్రాన్స్-28,132, స్పెయిన్-27,888, బ్రెజిల్-18,894, బెల్జియం-9,150, జర్మనీ-8,270, ఇరాన్-7,183, మెక్సికో-6,090, కెనడా-6,031, నెదర్లాండ్స్లో 5,748 మంది చనిపోయారు.