ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మరణించాడు. 41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిసి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,452కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 718గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ఏపీలో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు.