విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఎస్‌హెచ్‌యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో తమ ఇండ్ల నుంచి ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. కాసేపటికి పొగలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మే 7వ తేదీన విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టెరైన్ గ్యాస్ లీకేజీ కావడంతో.. 12 మంది మృతి చెందిన విషయం విదితమే. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటిలేటర్‌పై ఉన్న వాళ్లకు రూ. 25 లక్షలు ఇస్తామన్నారు ఏపీ సీఎం జగన్.