కరోనా వైరస్‌తో బుధవారం రాత్రి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనాతో మరణించిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.
పశ్చిమ మండలం పరిధి గోషామహల్ డివిజన్‌లోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ (37) వారం రోజుల క్రితం జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
దీంతో సదరు కానిస్టేబుల్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. కానిస్టేబుల్ మృతిపై కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు, అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.