నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చారకొండ మండల కేద్రానికి సమీపంలో తాటి వనానికి సమీపంలో ఉన్న కంప చెట్లను ఉపాధి హామీ కూలీలు తొలగించి నిప్పు పెట్టారు. అయితే ప్రమాదవశాత్తు నిప్పు తాటివనానికి అంటుకొని దాదాపు 300లకు పైగా తాటి, ఈత చెట్లు కాలిబూడిదయ్యాయి. గీత కార్మికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలు, కల్లుగీత, ఇతర సామగ్రి మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
