- పీసీబీలో 18 అంశాల్లో అధ్యయనం, శిక్షణ
- ఇంటర్న్‌షిప్‌కు కూడా అవకాశం
- ఎంపికైనవారికి రూ.20 వేల ైస్టెపెండ్
విద్యార్థులకు పర్యావరణ అంశాల్లో తర్ఫీదునిచ్చేందుకు తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి(పీసీబీ) ముందుకొచ్చింది. ఇంజినీరింగ్, సైన్స్ పట్టభద్రులను ఎంచుకొని వారికి శిక్షణనివ్వనున్నది. ఇందు లో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు కూడా బోర్డు అవకాశాన్నిచ్చింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ, బీటెక్, ఎంటెక్ చదువుతున్న వారికి ఈ అవకాశాన్ని కల్పించింది. కొంత నగదు రూపేణా పారితోషికాన్ని అందజేసి, మొత్తం 18 అంశాల్లో శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకోనున్నది. వీరితో ఆయా అంశాలపై లోతుగా అధ్యయనం చేయించి, కాలు ష్య కారకాల లోగుట్టును కనిపెట్టనున్నది.
కోర్సు ప్రత్యేకతలు: బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యార్థులు, పీహెచ్‌డీ స్కాలర్లకు అవకాశం కల్పిస్తారు. వీరికి ఆయా రంగాల్లో ప్రాక్టికల్ డెమో, శిక్షణ ఇస్తారు. అలాగే పర్యావరణ సంబంధ అంశాల్లో పర్యవేక్షణ, అంచనా, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ఫీల్డ్ విజిట్‌లు, ప్రయోగశాలలు, స్వీయ అనుభవం, శిక్షణలుంటాయి. కోర్సు కాల వ్యవధి 3-6 నెలలపాటు ఉంటుంది.
అర్హతలు..: ప్రస్తుత విద్యాసంవత్సరంలో బీఈ, బీటెక్, ఎంటెక్‌లో పర్యావరణ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు ఈ కోర్సు చేయడానికి అర్హులు. బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీలో కెమిస్ట్రీ(ఆర్గానిక్, ఇనార్గానిక్, అనలిటికల్, ఇండస్ట్రియల్) బయోటెక్నాలజీ విద్యార్థులను కూడా చేర్చుకుంటారు. ఐఐటీ, బిట్, నిట్‌లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో చదువుకున్న వారికి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌లో ఫైనల్ ఇయర్, ఎంఎస్సీ, ఎంటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు లేదా ఆ కోర్సులు పూర్తి చేసినవారిని ఎంపిక చేస్తారు. అయితే వీరు చదువులో ప్రతిభావంతులై ఉండాలి. మెరిట్ ఉన్న వారినే ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పట్టు ఉండాలి. శిక్షణ పొందేందుకు అన్ని రకాలుగా సంసిద్ధులై ఉండాలి. పీసీబీలోని సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు
స్టైపెండ్: ఎంపికైన వారికి నెలకు రూ.20వేలు చొప్పున ైస్టెపెండ్ ఇస్తారు. అయితే ఇంటర్న్‌షిప్ సమయంలో ఎలాంటి వసతి ఉండదు, టీఏ, డీఏ చెల్లించరు. విద్యార్థులే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. క్షేత్ర పరిశీలనలకు వెళ్లిన రోజులకు గాను కన్వేయెన్స్ చార్జీలుగా నెలకు రూ.5వేల చొప్పున రీయింబర్స్‌మెంట్ చేస్తారు.
జూన్ 30వరకు దరఖాస్తులు
సంబంధిత కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్ల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలు బయోడేటాతోసహా ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది సభ్యకార్యదర్శి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), ఏ -3, ఐఈ, సనత్‌నగర్, హైదరాబాద్, 44కు అడ్రస్‌కు పంపించాలి. జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 15 వరకు ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు. జూలై రెండో వారంలో అర్హులైనవారిని ఎంపికచేస్తారు. జూలై నాలుగో వారంలో ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది.