ఏపీలో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2627కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ బారినపడినవారిలో 1807 మంది బాధితులు కోలుకున్నారు. మరో 764 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 56 మంది మరణించారు.  

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో వాటిలో 11 కేసులకు తమిళనాడులోని కోయంబేడుకు సంబంధం ఉండగా, 17 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. కోయంబేడు కాంటాక్ట్‌ కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 కేసులు ఉండగా, మరో మూడు చిత్తూరు జిల్లాకు సంబంధించినవి. గత 24 గటంల్లో 11,357 మంది నుంచి నమూనాలు సేకరించగా అందులో 66 పాజిటివ్‌ వచ్చాయి.