సీఎం వైఎస్‌ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్‌ వేదికగా చిరంజీవి ప్రకటించారు.