కంటైన్మెంట్‌ జోన్ గా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రామచంద్రాపురం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారకొండ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మండల వైద్యాధికారి రూప ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు 132 ఇండ్లల్లోని 507 మందికి పరీక్షలు చేశారు. గ్రామస్తులకు హోంక్వారంటైన్‌ ముద్రలు వేశారు. కరోనా బాధితుడి భార్య, తల్లి, కుమారుడిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి, నల్లగొండ జిల్లా డిండి మండలం రామంతాపురం, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లి గ్రామాల్లో కరోనా బాధితుడి బంధువులు ఉండడంతో అతను ఆ గ్రామాలకు వెళ్లాడు. దీంతో ఆయా గ్రామాల్లో అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.