ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది మరణించారు. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారిలో 1848 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 14 కేసులకు కోయంబేడు లింకులు ఉన్నాయి.
