ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన వాటిలో 9 కేసులు కోయంబేడుతో సంబంధం ఉన్న కేసులు. ఏపీలో ఇప్పటి వరకు 2,787 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 58 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్‌ కేసులు 816 కాగా, 1913 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.