ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. కాగా, బుజ్జి 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.