దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజులుగా ప్రతి రోజు 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య పదిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది.
ఢిల్లీలో మరణాల సంఖ్య కూడా ఇప్పటి వరకు 303కు చేరుకున్నది. ఇక ఢిల్లీలో నమోదైన మొత్తం 15,257 కేసులలో 7264 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ అయిన వారు, 303 మరణాలు పోగా ఇంకో 7,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ బుధవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించింది.