నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుకు సబ్ స్టేషన్ దగ్దం

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగు పడటంతోనే షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్దమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి అధికారులు మంటలార్పారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.