ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 లక్షల 89 వేల 571 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షల 34 వేల 521. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 57 వేల 432 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 24 లక్షల 97 వేల 618 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కోవిడ్-19తో యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,02,107 మంది చనిపోయారు. కోవిడ్-19 కారణంగా వివిధ దేశాల్లో అత్యధికంగా సంభవించిన మరణాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్-25,697, రష్యా-3,968, స్పెయిన్-27,118, యూకే-37,460, ఇటలీ-33,072, ఫ్రాన్స్-28,596, జర్మనీ-8,533, టర్కీ-4,431, ఇరాన్-7,564, పెరూ-3,983, కెనడా-6,765, చైనా-4,634, మెక్సికో-8,597, పాకిస్థాన్-1,225, బెల్జియం-9,364, నెదర్లాండ్స్-5,871, ఈక్వెడార్-3,275, స్వీడన్-4,220, పోర్చుగల్-1,356, ఐర్లాండ్-1,631, ఇండోనేషియా-1,473, పోలాండ్-1,028, రోమేనియాలో 1,227 మంది చనిపోయారు.
