ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించిన కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎనిమిది కోయంబేడు లింకులు ఉన్నాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 59 మంది చనిపోయారు. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు 824 కాగా, 1,958 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
