దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు

భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు,  194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి పెరిగింది. వీటిలో ప్రస్తతం 86,110 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67,692 నయమై కోలుకున్నారు. ఈ వైరస్ మహమ్మారితో 4,531 ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కోలుకున్న వారు 42.72 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ప్రపంచలో 56లక్షల 81వేల మందికి కరోనా వైరస్ సోకింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.