రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల వివిధ ఆస్పత్రులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని మూడు ఆస్పత్రులకు జరిమానా విధించారు. మూడు ఆస్పత్రులకు కమిషనర్ రూ.85 వేలు జరిమానా విధించారు.
