ఫ్యాన్ల కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

బాలానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్‌లోని యాస్‌ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.