పాలిసెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు వ్యవసాయ యూనివర్సిటీ పొడిగించింది. ఆలస్య రుసుముతో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పాలిసెట్లో వచ్చిన ర్యాంకుల ద్వారా మాత్రమే జరుపుతామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. పూర్తి వివరాలకు www.polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వైబ్సైట్ చూడవచ్చన్నారు.
