ఐవోసీఎల్‌ అప్రెంటిస్‌ల దరఖాస్తు గడువు పొడిగింపు.. పెరిగిన పోస్టులు

దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్‌ దఖాస్తుల గడువును జూన్‌ 21 వరకు పొడిగించింది. దీంతోపాటు మొత్తం పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. ఫిబ్రవరిలో వివిధ విభాగాల్లో 500ల అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 600కు పెంచింది. షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల గడువు ఈ నెల 25తో ముగిసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మరోమారు అప్లయ్‌ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు https://rectt.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జెనరిక్‌ ఆప్టిట్యూడ్‌ 30 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీస్‌ 30 మార్కులు, బేసిక్‌ ఇంగ్లిష్‌ 40 మార్కులకు ఉంటాయి.