ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కలకలం

అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగినవారు, సికింద్రాబాద్‌ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు.