ఏపీలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ప్రభుత్వపరంగా రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)’ సేవలు ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఆరంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ రైతులతో మాట్లాడారు. ఆర్‌బీకేల ద్వారా రాయితీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేయనుంది. వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల సాగులో సలహాలను ఇవ్వనుంది.