ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 10,567 మంది నమూనాలను పరీక్షించగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,118కి చేరింది.    కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కరోనా వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 64 మంది చనిపోయారు. సోమవారం వరకు 2169 మంది   కొలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 885 మంది  కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో  నెల్లూరులో 8 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చారు.