అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయంలోని మొత్తం ఐదు బ్లాకులను శానిటైజ్ చేయనున్నారు. లాక్డౌన్తో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకువచ్చారు. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.
