అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆరో వార్షికోత్సం సందర్భంగా అసెంబ్లీలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు ఇరువురు నేతలు నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.