ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనవంతు బాధ్యతలు ఏంటి..?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 2
మన చూట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. కాబట్టి మనం కూడా పర్యావరణం పట్ల బాధ్యతతో మెసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు బాధ్యతగా మనం పాటించాల్సిన కొన్ని సూచనలు :
01) ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వీలైనంతవరకు తగ్గించాలి. షాపింగ్ కి వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ ను వెంట తీసుకెళ్ళాలి.
02) మన చూట్టు ప్రక్కల ఉన్న ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి ఆ మొక్కలకు ఉదయం కానీ, సాయంత్రం కానీ నీరు పోయాలి.. అప్పుడైతే ఎక్కువ శాతం నీరు ఆవిరి కాకుండా మొక్కలకి అందుతుంది.
03) మనం కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలి. అలాగే మన చూట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
04) అనవసరంగా నీరు వృధా చేయకూడదు. ఇంట్లో టాప్స్ లీకేజ్ లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి. నిల్వ ఉన్న నీరు వృధాగా పారబోసే బదులు… మొక్కలకి పోయాలి.
05) పెట్రోల్ వినియోగం తగ్గించి, కాలుష్యాన్ని నియంత్రించాలి. బండిలో పెట్రోల్ ఉదయం పూట పోయించుకోవటం మంచిది. దాని ద్వారా మైలేజ్ కూడా పెరుగుతుంది.
06) గ్లోబల్ వార్మింగ్ ని నియాంత్రించాలి. అనవసరమైన చోట బల్బులు, ఫ్యాన్ లు, ఎ.సి.లు ఆపి, విద్యుత్ ఆదా చేయలి.
07) మనకి రోజు వారిలో కనీసం ఒక పేపర్ అయినా అవసరం అవుతుంది. పేపర్ ఎంత తక్కువ వాడిగే అంత మంచిది. పేపర్ కోసం రోజుకి కొన్ని లక్షల చెట్లని నరుకుతున్నారు. న్యూస్ పేపర్ కొనకపోవటం చాల మంచిది. పేపర్ వాడకం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. న్యూస్ పేపర్ అయితే ఇంటర్నెట్ లో ఈ -పేపర్ ద్వారా చదువుకోవచ్చు.
08) మనకి విద్యుత్ ప్రతి నిమిషం అవసరం. కానీ ఆ విద్యుత్ మన పరిసరాన్ని తద్వారా మన ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందంటే చాల మంది నమ్మరు. బొగ్గుతో విద్యుత్ తయారయ్యే కేంద్రాలలో అధికం. విద్యుత్ ని కేవలం బొగ్గుతోనే కాకుండా పవనం మరియు సూర్యరశ్మితో కూడా తయారు చేయవచ్చు.
09) మనం తక్కువ దూరలైతే నడవగలం లేదా సైకిల్ వాడగలం. ఇలా చేయడం వల్ల పెట్రోల్ ఆదా చేయగలుగుతాం. వారానికి ఒక్క రోజైన సొంత వాహనాన్ని పక్కన పెట్టి, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగిస్తే మంచిది. దీని ద్వారా వాహన పొల్యూషన్ తగ్గించిన వారిమౌతాం.
10) కిరోసిన్ వాడే ఆటోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వారు కూడా ఆటోలతో పొల్యూషన్ రాకుండా చూసుకోవాలి. కొంతమంది బయట కనపడిన టైర్లు, చెత్త కాలుస్తుంటారు ఆవి తగ్గించుకోవాలి.
ఇలా ఎవరికి వాళ్ళం పొల్యుషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయలి. పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి.