భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నటి భూమి పెడ్నేకర్ నిర్ణయించారు. వాతావరణ మార్పు అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని, ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక వ్యాధులను చూస్తే అర్థమవుతుందని భూమి ట్విట్టర్లో హాష్‌ట్యాగ్ క్రైమేట్ వారియర్ పేరతో పోస్ట్ చేశారు.
ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఈ నెల 5వ తేదీన తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకొందామంటూ ప్రతీ పౌరుడు ప్రతిజ్ఞ చేయాలని భూమి పెడ్నేకర్ ప్రచారంతో చేతులు కలిపిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, ఇన్స్టాగ్రాం పోస్టింగ్‌లో భూమికి మద్దతుగా అక్షయ్‌కుమార్ నిలిచారు. ఎంతో అందమైన ప్రకృతిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అక్షయ్‌కుమార్ ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భూమి పెడ్నేకర్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
