ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 180 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఒక రోజు వ్యవధిలో కరోనా వల్ల నలుగురు మృతి చెందారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 94 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 68 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 967 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం వరకు 2,224 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.