కామారెడ్డి జిల్లాలో సీఎస్‌ ఆకస్మిక పర్యటన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. తిర్మన్‌పల్లిలో మిషన్‌ భగీరథ నల్లాలను, పారిశుద్ధ్య పనులు, హరితహారం నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకాన్ని ఏ విధంగా చేపడుతున్నారని వాకబు చేశారు. వానాకాలం పంటల సాగు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతువేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.