తెలంగాణలో శుక్రవారం మరో 143 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్ 5, వరంగల్ 3, ఖమ్మం 2, ఆదిలాబాద్ 2, మేడ్చల్ 2, సంగారెడ్డి 2, కరీంనగర్ 2, మంచిర్యాల జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఒక్కరోజే ఎనిమిది మంది మృతిచెందగా, 40 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,290 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 113 మంది మరణించారు. 1,627 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా, మిగిలిన 1,550 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.
