రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జన్నారం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెరో మూడు, మూడు మొక్కలు నాటిన లక్సెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, జన్నారం ఎస్ఐ వినోద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సీఎం కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ సాధించే వరకు అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి, మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణకి ధన్యావాదాలు తెలుపుతున్నాం అన్నారు.