దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరింది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా కరోనాతో 287 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 120406 ఉన్నాయి. ఆసుపత్రులలో చికిత్స తీసుకుని ఇప్పటి వరకు 119293 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 6929 మంది మృత్యువాత పడ్డారు. కరోనా కేసుల్లో క్రమంగా టాప్‌లో ఉన్న దేశాలను చేరుకుంటుంది భారత్.
