ఎల్జీ పాలిమర్‌ ఘటనపై కొనసాగుతున్న విచారణ

విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్‌ గ్యాస్‌ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం  గ్యాస్‌ ప్రభావిత ప్రాంత ప్రజలు , వివిధ పార్టీ నాయకులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

స్థానిక ఎంసీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి ఎంపిక చేసిన బాధితులను మాత్రమే అనుమతించారు. వీరిలో కొందరిని ఆదార్‌ కార్డు వివరాలు సక్రమంగా లేవని అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. గ్యాస్‌ లీకేజీ సంఘటనలో మరణించిన కనకరాజు భార్య సమావేశంలో పాల్గొనేందుకు రాగా పోలీసులు అనుమతించకపోవడంతో  సొమ్మసిల్లి డిపోగా ఆమెను దవాఖానకు తరలించారు.