ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 4,06,127 మంది బాధితులు మరణించారు. నమోదైన మొత్తం కేసుల్లో 32,20,442 యాక్టివ్ కేసులు ఉండగా, 34,60,171 మంది బాధితులు కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 20 లక్షలు దాటించింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 20,07,449 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల 1,12,469 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 11,33,272 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 7,61,708 మంది కోలుకున్నారు. అమెరికాలో గత 24 గంటల్లో కరోనాతో 691 మంది చనిపోయారు. 6,91,962 పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 37,312 మంది మరణించారు.
రష్యాలో ఇప్పటివరకు 4,67,673 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కరోనా వైరస్ వల్ల 5,859 మంది బాధితులు మరణించారు. స్పెయిన్‌లో 2,88,630 పాజిటివ్ కేసులు నమోదవగా, 27,136 మంది మరణించారు. బ్రిటన్‌లో 2,86,194 మంది ఈ వైరస్ బారిన పడగా, 40,542 మంది మృతిచెందారు. అత్యధిక కేసుల జాబితాలో ఆరో స్థానానికి దూసుకొచ్చిన భారత్‌లో ఇప్పటివరకు 257,486 కేసులు నమోదవగా, 7207 మంది మరణించారు. ఇటలీ, పెరూ, జర్మనీ, ఇరాన్ లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులతో వరుసగా ఏడు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.