మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి ఆదరణ లభిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఒకరికి ఒకరు పోటీ పడుతూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ చేరో మూడు మొక్కలను నాటడమే కాకుండా మరో ఆరుగురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మేము భాగస్వాములం కావండం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కారణమైన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి, ఏసీపీ లక్ష్మీ నారాయణకి ధన్యావాదాలు తెలుపుతున్నాం అన్నారు.