తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఏడో అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది అంతా హోంక్వారంటైన్లో ఉన్నారు. ఎనిమిదో అంతస్తు ఆర్థిక శాఖలోనూ కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.
