ఏపీలో కొత్తగా 154 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 154 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4813కు చేరుకొంది. విదేశాల నుంచి వచ్చిన ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 28 మందికి, మిగతావారు రాష్ర్టానికి చెందిన వారని అధికారులు తెలిపారు.  ఇప్పటివరకు  75మంది ప్రాణాలు కోల్పోగా 2387 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు.