విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘటనలో తాజాగా మరొకరు మృత్యువాతపడ్డారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స అనంతరం గత కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. అయితే, ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. కాగా, రెండు రోజుల క్రితమే తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురై మృతిచెందాడు. దీంతో ఆ కటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
