హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం – మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, చైర్‌పర్సన్‌ ప్రణీత, వైస్‌చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, కమిషనర్‌ స్వామి, డీఈ సుమతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
హరితహారానికి సిద్ధం చేయండి..
కీసర / శామీర్‌పేట : హరితహారానికి సర్వం సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మండల పరిధిలోని రాంపల్లిదాయర,చీర్యాల్‌ గ్రామాల్లో పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, రోడ్డుకిరువైపుల హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఎంపీపీ మల్లారపు ఇందిర, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, సర్పంచ్‌లు గరుగుల ఆండాలు, తుంగ ధర్మేందర్‌ పాల్గొన్నారు.
శామీర్‌పేట కట్టమైసమ్మ వద్ద ఉన్న రాజీవ్‌ రహదారి బ్రిడ్జిను కలెక్టర్‌ పరిశీలించారు. సుందరీకణ పనుల్లో భాగంగా బ్రిడ్జికి ఇరుపక్కల కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని, గార్డెన్‌ గ్రాస్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ చందర్‌సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.