తెలంగాణలో కొత్తగా మరో 92 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 92 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 3,742కు చేరింది. కరోనా ప్రభావంతో సోమవారం మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 139కి చేరింది.