బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్లో ఆయన పరీక్ష చేయించుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన తల్లి మాధవి రాజ్ సింధియాకు కూడా కరోనా వైరస్ సంక్రమించినట్లు పరీక్షలో రుజువైంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న జ్యోతిరాదిత్య.. నాలుగు రోజుల క్రితం మ్యాక్స్ సాకేత్ హాస్పిటల్లో చేరారు. జ్యోతిరాదిత్యలో లక్షణాలు ఉన్నా.. ఆయన తల్లిలో మాత్రం లక్షణాలు కనిపించడంలేదు. ఇద్దరూ ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రలో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గూర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేరిన ఆయన సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
