ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటలతో 15085 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 147 పాజిటివ్ వచ్చింది.
కరోనా చికిత్స తీసుకుని ఈరోజు 16 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. వారిలో ఒకరు కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా మరో వ్యక్తి అనంతపూర్ వాసి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3990 కాగా వీరిలో 2403 మంది కోలుకున్నారు. 77 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారు 1510 మంది ఉన్నారు.