కొత్తగా పాస్‌పుస్తకాలు పొందినవారు రైతుబంధు కోసం దరఖాస్తుచేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. వీరితోపాటు వివిధ కారణాలతో గతంలో రైతుబంధు పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ కాపీలను జతచేయాలని, భూమి ఎవరి పేరుపై ఉన్నదో ఆ రైతే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.
